రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్
భూపాలపల్లి, అక్టోబర్ 19 (అక్షర సవాల్):
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో విద్యార్ధిని ,విద్యార్ధులకు, యువతి, యువకులకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ తెలిపారు. (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహించబడుతాయని. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 23వ తేదీలోపు జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను జిల్లా పోలీసు పీఆర్వోకు అందజేయాలన్నారు.
ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఈవ్లీజింగ్, ర్యాగింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మాలు, ఇతర సామాజిక రుగ్మతలు. అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి, గత సంవత్సరం 2022 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. మరిన్ని వివరాల కోసం 8712658164 నెంబర్ ద్వారా పీఆర్వోను సంప్రదించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలలో విద్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పి కిరణ్ ఖరె కోరారు.