Trending Now
Thursday, December 26, 2024

Buy now

Trending Now

మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పి

మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే.

-నిర్భయంగా ఓటు వేయండి మావోయిస్ట్ లకు ఎవరూ భయపడవద్దు, మీకు భద్రతగా మేముంటాం :ఎస్పి కిరణ్ ఖరే .

భూపాలపల్లి, నవంబర్ 6 ( అక్షర సవాల్):

ఈ నెల 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, వినియోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం మావోయిస్ట్ ప్రభావిత మండలం అయిన పలిమేల పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల, సమస్యాత్మక, మావోయిస్టు ప్రాబల్యం గల ముకునూరు పొలింగ్ కేంద్రాన్ని , గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎస్పి  పర్యటించారు.ఈ సందర్బంగా ముకునూరు గ్రామ ప్రజలతో ఎస్పి  మాట్లాడుతూ మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరూ భయపడవద్దని మీ అందరికీ పోలీసు బలగాలు తోడుగా ఉంటాయని, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రజాస్వామ్య బద్ధంగా వినియోగించుకొని, మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషించాలని అన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని 100 శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పి  పేర్కొన్నారు. అలాగే యువత మరియు ప్రజలు మావోయిస్ట్ ల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికీ సహకరించవద్దని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మవద్దని, పోలీసులు ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, సహకరిస్తారని తెలియజేశారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహాదేవ్ పూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై థామస్ రెడ్డి, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles