వరంగల్ జూలై 25 అక్షర సవాల్ : వరంగల్ జిల్లాలో ఎథీరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో ఇంజినీరింగ్ విద్యార్థులకు టోకరా వేశారు. ఒక్కో విద్యార్థి నుంచి నిర్వాహకులు రూ.లక్షకు పైగా వసూలు చేశారు. నిర్వాహకుడు అరుణ్ కుమార్ రాపోలుతో పాటు ముగ్గురు డైరెక్టర్లపై సీపీ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.