వరంగల్ జూలై 25 అక్షర సవాల్ : హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. పరకాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన లడే సాంబలక్ష్మి తన ఇరువురు కుమారులు లడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు మాదారం రెవెన్యూ పరిధిలో తన పేరున ఉన్న 9 గుంటల ఇంటి స్థలం గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో రిజిస్ట్రేషన్ అధికారి లంచం డిమాండ్ చేసినట్లు తెలిపింది. సబ్ రిజిస్ట్రార్ కే సునీత డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ద్వారా లంచం డిమాండ్ చేయడంతో సాంబలక్ష్మి కుమారుడు శ్రీనివాస్, నరేష్ డిమాండ్ మేరకు లంచం 80,000వేల రూపాయలు నగదు అందిస్తుండగా ఏసిబి డిఎస్పి సాంబయ్య నేతృత్వంలో నరేశ్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం పరకాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

