- తగ్గేదేలే!
పరకాల బరిలో సుష్మిత పటేల్
వరంగల్, జూన్ 29 అక్షర సవాల్: ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ , ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రాజేసుకున్న వేళ.. గాంధీ భవన్ కు వెళ్లి సంజాయిషీ ఇచ్చుకొని మరో సంచలన నిర్ణయం తీసుకున్న కొండా ఫ్యామిలీ.
*పరకాల ఎమ్మెల్యే* అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్ధమైన మంత్రి కొండా సురేఖ, మురళి దంపతుల కూతురు కొండా సుస్మిత పటేల్
వచ్చే ఎన్నికల్లో తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తన అధికారిక ఇన్స్టా గ్రామ్ అకౌంట్ లో తెలిపింది. తమ సవాళ్లకు తగ్గేదేలే అన్నట్లుగా వారి కూతురు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధ మవుతున్నారు. ఇక వరంగల్ లో రాజకీయం మరింత వేడెక్కనుంది. కొండా మురళి వ్యాఖ్యలకు మరో సారి ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశం అవుతున్నారు.