Trending Now
Friday, September 6, 2024

Buy now

Trending Now

స్మార్ట్ ఫోన్..లాభం కంటే నష్టామే ఎక్కువ…

స్మార్ట్ ఫోన్..లాభం కంటే నష్టామే ఎక్కువ…

ఆంధ్రప్రదేశ్ ,జులై 17 (అక్షర సవాల్ ): 

చిన్న పిల్లల కాడనుంచి పెద్దల వరకు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్.. కానీ ఆ స్మార్ట్ ఫోన్ తో ఎవరు ఏం చేస్తున్నారు?

పెరుగుతున్న టెక్నాలజీపై సరైన అవగాహన లేకుండా లాభం కంటే నష్టామే ఎక్కువ.

  • ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో జూలై 7న ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి దారణంగా చంపి శవాన్ని కాలువలో వేశారు. ఆడుకోవడానికి కొత్త ప్లే గ్రౌండ్ కు తీసుకెళ్తామని చెప్పి.. చిన్నారిని ముగ్గురు మైనర్ బాలురు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఎనమిదేళ్ల చిన్నారిపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ పనిఅంతా చేసింది 13 నుంచి 17 ఏళ్ల ఉన్న ముగ్గురు అబ్బాయిలు. ఇంతటి కూర్రమైన చర్యలు ఆ చిన్న పిల్లల మైండ్ లోకి ఎలా వచ్చాయి? అత్యాచారం చేయాలనే కోరిక వారికి ఎలా తట్టింది?

    • బాలికలను చంపి కాలువలో వేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.?

ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన నంద్యాల పోలీసు సూపరింటెండెంట్ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ..అత్యాచారం చేయడానికి ముందు ఆ ముగ్గురు బాలురు స్మార్ట్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూశారంట. తెలిసితెలియని వయసులో శనికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ చిన్న పిల్లల బుర్రలో ఆ మొబైల్ ఫోన్ యే కలిగించింది. ఈ దుర్మార్గపు చర్యలో ఓ బాలుడి మామ, తండ్రి కూడా సహకరించారట. అత్యాచారం తర్వాత ముగ్గురి మైనర్ కుర్రాళ్లలో ఒకడి తండ్రి, మామ శవాన్ని మాయం చేయడానికి కుట్ర పన్నారు. నిందితులు బాలురు ఇద్దరు, ఇద్దరు వ్యక్తుల సహాయంతో మైనర్ మృతదేహాన్ని సైకిల్పై కొంత దూరం, తర్వాత మోటారుసైకిల్ పై కృష్ణా నది బ్యాక్వాటర్కు తరలించారు. చిన్నారి శరీరానికి రాయి కట్టి ముచ్చుమర్రి గ్రామంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడేశారు. సోమవారం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కు పంపారు.

Related Articles

Latest Articles