మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లలలో పర్యటించిన ఎన్నికల పరిశీలకులు
భూపాలపల్లి, నవంబర్ 20 ( అక్షర సవాల్):
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి అసెంబ్లీ ఎన్నికల జనరల్, పోలీసు పరిశీలకులు అభయ్ నందన్ అభిస్తే, అమిత్ కుమార్ అన్నారు. సోమవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లయిన దూదేకులపల్లి, అజంనగర్, దిక్షకుంట, నందిగామ, పంబాపూర్, రాంపూర్, గోళ్ళబుద్దారంలో ఎన్నికల పరిశీలకులు పర్యటించి, పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పరిశీలించి, ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొవాలని అన్నారు. మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ర్యాంపులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమైన పనులను ముందస్తుగా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. ఎన్నికల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా పనిచేసి స్వేచ్ఛాయుత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా సమర్దవంతంగా పనిచేయాలని అభయ్ నందన్ అబిస్తే, అమిత్ కుమార్, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహారెడ్డి ,ఎమ్మార్వో శ్రీనివాస్, ఎస్ఐ సంధ్యారాణి, పాల్గొన్నారు.