Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

నూతన చట్టాలపై పోలిసు అధికారులు, సిబ్బందికి శిక్షణ, అవగాహన తప్పనిసరి : ఎస్పీ

నూతన చట్టాలపై పోలిసు అధికారులు, సిబ్బందికి శిక్షణ, అవగాహన తప్పనిసరి : ఎస్పీ

– జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలు

– విడతలవారీగా జిల్లా పోలీసులు అందరికీ శిక్షణ అందజేత

– సిబ్బంది నూతన చట్టాలను నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి

-శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పీ

భూపాలపల్లి, జూన్ 1(అక్షర సవాల్):

జూలై 1 2024 నుండి దేశవ్యాప్తంగా నూతన చట్టాలను అమలు కానున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు అవగాహన కార్యక్రమాలను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే  తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసులు అందరికీ విడతలవారీగా నూతన చట్టాలపై శిక్షణను అందిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేయడం జరిగింది. దేశంలో న్యాయ వ్యవస్థలోని చట్టాలను మార్చేందుకు తీసుకోనున్న చర్యలలో భాగంగా కొత్తగా రూపొందించిన నూతన మూడు చట్టాలు, భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,భారతీయ సాక్ష్యా అధినియం.

ఈ మూడు చట్టాలు రానున్న జూలై 1, 2024 నుండి అమలులోకి రానున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ముఖ్యంగా నూతన చట్టాల నందు మారిన సెక్షన్స్ మరియు చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరించి తెలియజేయాలని సూచించారు. మారిన చట్టాలను అనుగుణంగా కేసులను నమోదు చేసే విధంగా పూర్తిగా సంసిద్ధమై ఉండాలని అన్నారు. నూతన చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా ప్రతి ఒక్క పోలీసు అధికారికి, సిబ్బందికి అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలనే తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు, చేర్పులు చేశారని అన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందని, ఎస్పి  అన్నారు. ప్రతి ఒక్కొరూ నూతన అంశాలను నేర్చుకోవాలని ఎస్పి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నారాయణ నాయక్, డీసీఆర్బి  , ఎస్బి ఇన్స్పెక్టర్లు, రామకృష్ణ, వసంత్ కుమార్, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్లు రత్నం, కిరణ్, శ్రీకాంత్ జిల్లా పరిధిలోని ఎస్ఐ లు, కోర్టు డ్యూటీ అధికారులు, స్టేషన్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles