Trending Now
Sunday, October 27, 2024

Buy now

Trending Now

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ 

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ 

భూపాలపల్లి, ఆగస్టు 8(అక్షర సవాల్):

ర్యాగింగ్‌కు పాల్పడి విద్యార్థులు బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారని, వ్యసనాలకు బానిసై విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పి  సూచించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందాలని ఎస్పి కిరణ్ ఖరే  పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నారని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పి  తెలిపారు. యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలని తెలిపారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని,సీనియర్లు, జూనియర్లు అని కాకుండా సీనియర్లు జూనియర్లకు గైడ్‌లా వ్యవహరిస్తూ, స్నేహితులుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ, జూనియర్లకు మార్గదర్శకంగా, విద్యార్థులు ర్యాగింగ్‌ వంటి మహమ్మారికి దూరంగా ఉండాలని, తమ భవిష్యత్‌ నిర్మాణం కోసం కళాశాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్పి  పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles