Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

నేడు కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి

నేడు కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి

జగిత్యాల, జూన్ 01( అక్షర సవాల్)
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో హను మాన్ భక్తుల హడావుడి కనిపిస్తుంది.ఈరోజు కొండగట్టు లో హనుమాన్ పెద్ద జయంతి జరుపుకుంటున్నారు.

మాల విరమణ కోసం అంజన్న భక్తులు వేలాది సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీంతో కొండగట్టు ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంత మోగిపోతుంది, వైశాఖ మాసంలోని దశమి తిథిలో హనుమాన్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.

జూన్ 1వ తేదీ ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలోహనుమంతుడు శని గ్రహం లేదా శనిశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించ బడుతున్నాడు.

హనుమంతుడి జన్మది నోత్సవం రోజున పూజలు చేయడం ద్వారా శని చెడు ప్రభావాల ను నుంచి బయటపడవచ్చు.

హనుమాన్ జన్మ దినోత్సవ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆలయాల్లో శనివారం జూన్ 1, 2024 అత్యంత భక్తిశ్రద్ధ లతో జరుపుకుంటున్నారు.

ఈ సమయంలో రోజు పూజ చేసి హనుమాన్ మంత్రా లను పఠిస్తారు. 41 రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు.

ఈ వేడుకలో ప్రధానంగా ‘సుందర కాండ’ పవిత్రమైన పఠనం. రామాయణంలోని అనేక భాగాలు హనుమం తుడు లంకలో సీతా దేవి కోసం వెతుకుతున్న సమ యంలో అతని ధైర్యాన్ని గురించి వివరిస్తాయి….

Related Articles

Latest Articles