కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ఏపీ సీఈవో
అమరావతి:జూన్ 03(Aksharasaval):
ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశిం చారు.
రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేం దుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరిం చారు..

