భారీ వర్షాలు, గోదావరి వరదలపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్ ,జులై 20( అక్షరసవాల్):
ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా జిల్లాల కలెక్టర్లు, ములుగు కలెక్టర్ తో మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడుతూ గోదావరి వరద పరిస్థితి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు .వరదల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి సమీప గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారి చేశారు. వాగులు ఉప్పేంగే ప్రాంతాల్లో పోలీసుల నిఘా వుంచాలనీ సూచనలు చేశారు. గత అనుభవాల దృష్టిలో ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లండించారు.
ఇప్పటికే కంట్రోల్ రూం, పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.