అక్రమ భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలి
నర్సంపేట, జూలై 26,అక్షర సవాల్:పట్టణ కేంద్రంలోని 121 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిగా 2011లో అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ గుర్తించారని,కానీ ఆ స్థలాన్ని స్థానిక అధికారుల నిర్లక్ష్య ధోరణి మూలంగా అన్యాక్రాంతం అవుతున్నట్లు దళిత సంఘాల జేఏసీ నాయకులు దళిత రత్న ప్రణయ్ దీప్ తదితరులు ఆరోపించారు.ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారని దానిని రద్దు చేయాలని మున్సిపల్ అధికారి నాగరాజు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ స్థలాన్ని అంబేద్కర్ భవన నిర్మాణానికి,ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కేటాయించినట్లు,అయిన కూడా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవడంతో అక్కడ నిర్మాణాలు జరగకుండా ఉందని ఆయన ఆరోపించారు.అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణానికి అనుమతి నీ రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంద ప్రకాష్,నారాయణ,శ్రీకాంత్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.