Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది..!!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది..!!!

హైదరాబాద్ ఆగష్టు 8 అక్షర సవాల్ : ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూశారు. ఈమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమర్తె. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈమె డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వయానా చెల్లెలు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం ‘జబర్దస్త్‌’ ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే కామెడీ షో కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కి మంచిపేరును తీసుకు వచ్చింది. తద్వారా శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కొత్తనటులను ప్రోత్సహిస్తూ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఈయన అరుంధతి, అంజి, అంకుశం, అమ్మోరు, వంటి ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ గా పని చేశారు. అయితే ఆయన విజయం వెనుక వరలక్ష్మీ పాత్ర కూడా ఉంది.

Related Articles

Latest Articles