కులమతాలకతీతంగా వినాయకచవితి. సబ్ ఇన్స్పెక్టర్ మునావత్ రమేష్ పరకాల ,ఆగస్టు 31, అక్షర సవాల్: : కులమతాల కతీతంగా వినాయక చవతి జరుపుకోవడం సంతోషకరమని పరకాల సబ్ ఇన్స్పెక్టర్ మునావత్ రమేష్ అన్నారు.నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పరకాల మమతానగర్ కాలనీ లోనీ స్వర్ణకార సంఘం గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎస్ ఐ మునావత్ రమేష్ నాయక్ హాజరై ప్రారంబించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ భక్తి భావంతో వినాయకుని సేవలో కులమత బేధాలు లేకుండా ఐక్యమత్యంతో కలిసి ఉండి ఇలాంటి పూజలు చేసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.