
సమాజంలో కీలక జర్నలిస్టుల పాత్ర
– పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు
– టీఎస్ జేయు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం
– గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
– టి.ఎస్.జే.యు ఆధ్వర్యంలో ఉచిత వైద్య, నేత్ర పరీక్ష మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు
వరంగల్, నవంబర్ 16అక్షర సవాల్:
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతోమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ కీలకంగా ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఆదివారం 22వ డివిజన్ పరిధి వాసవి కాలనీలో గలనర్ వీల్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉచిత వైద్య, నేత్ర పరీక్ష మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఇంతటి గొప్పగా నిర్వహించిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(టి.ఎస్.జే.యు) వరంగల్ జిల్లా బాధ్యులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛకు, పరిధికి భంగం కలిగించేలా ఎవరూ కూడా ప్రవర్తించకూడదని అన్నారు. అలాగే సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి సమాజాభివృద్ధికి ప్రతి జర్నలిస్టు కృషి చేసింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టు వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. వృత్తితో పాటు సామాజిక బాధ్యతగా టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అంటూ జర్నలిస్టులకు నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎస్ జేయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి మాట్లాడుతూ టీఎస్ జేయూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి అనిల్ ఈ మేరకు నిర్వహించడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో టీఎస్ జేయు అన్నివేళలా ముందుంటుందని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ జర్నలిస్టులపై జరుగుతున్న రాష్ట్రాలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లకు అతీతంగా విచ్చేసి విజయవంతం చేసిన జర్నలిస్టులకు టీఎస్ జేయు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజెపి జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, మట్వాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రావు, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఏజే మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు, వరంగల్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గజ్జె గోవర్ధన్, టీఎస్ జె యు రాష్ట్ర నాయకులు నాగరాజు,నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, గంగరాజు, కృష్ణ, కోశాధికారి సత్యం, కార్యవర్గ సభ్యులు శ్రీహరి, సురేష్, రాజు, అశోక్, అవినాష్, డా.దయాకర్ వైద్య బృందం, ఎంజీఎం బ్లడ్ బ్యాంకు సిబ్బంది, శరత్ ఐ హాస్పిటల్ సిబ్బంది మరియు జర్నలిస్టులు, ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.

