Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మహిళను అరెస్ట్

–1.1 కిలోల గంజాయి స్వాధీనం

మందమర్రి , జులై 17 (అక్షర సవాల్ ):

గుట్టుచప్పుడు కాకుండా మందమర్రి పట్టణం లో గంజాయి అమ్ముతున్న మందమర్రి చెంచు కాలనీకి చెందిన గుర్రాల అనిత అనే మహిళను బుధవారం మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం
మందమర్రి పట్టణం విద్యానగర్ కు చెందిన గుర్రాల అనిత అనే మహిళ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో ప్రభుత్వ నిషేధిత గంజాయని విక్రయించాలని నిర్ణయించుకొని , మక్కల గంగాధర్ , నివాసం విద్యానగర్ మందమర్రి అనే యువకుడుకి కొంత డబ్బు ఇచ్చి గంజాయి తీసుకురమ్మని చెప్పగా, అతను చంద్రపూర్ కి వెళ్లి రెండు కిలోల గంజాయి తీసుకువచ్చి అనితకి ఇచ్చాడు. అనిత ఆమె దగ్గరికి వచ్చే కొంతమంది గుర్తు తెలియని వినియోగదారులకి ఒక్కొక్క ప్యాకెట్ 300 రూపాయల చొప్పున అమ్మి లాభాలు పొందేది. ఈరోజు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గుర్రాల అనిత నివాసం యొక్క పరిసర ప్రాంతాలలో తనిఖీ చేయగా ఆమె వద్ద ఒక 1 కిలో 100 గ్రాముల గంజాయి లభించింది. అట్టి అట్టి గంజాయిని సాధన పరచుకొని గుర్రాల అనితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం అయినది. బెల్లంపల్లి సబ్ డివిజన్ లో ప్రభుత్వ నిషేదిత గంజాయిని అమ్మిన, కొన్న సేవించిన, రవాణా చేసిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని, వారిని జైలుకు పంపడం జరుగుతుందని , వారి పైన షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ హెచ్చరించారు. మంచిర్యాల డిసిపి  సూచన మేరకు ఏసిపి బెల్లంపల్లి ఆధ్వర్యంలో నేరస్థురాలుని, గంజాయిని పట్టుకున్న కే .శశిధర్ రెడ్డి సిఐ మందమర్రి, ఎస్ రాజశేఖర్ ఎస్ఐ మందమర్రి, హెడ్ కానిస్టేబుల్ రాము, మహిళ హెడ్ కానిస్టేబుల్ పద్మ, హోంగార్డ్ ఆఫీసర్ ఉమ లను రామగుండం సిపి ఎం. శ్రీనివాస్ ఐజి అభినందించినారు.

Related Articles

Latest Articles