హేమాచలుని సన్నిధిలో మంత్రులు
మంత్రులను వేదమంత్రాలతో ఆహ్వానం
విశేష పట్టు వస్త్రాలు సమర్పణ
స్వామివారికి తైలాభిషేకం ప్రత్యేక పూజలు గోత్రనామార్చనలు
మంగపేట,మార్చి 01, అక్షర సవాల్:
తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన మల్లూరు హేమచల శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి దైత అమ్మవార్ల దేవాలయాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి (అనసూయ)సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ పినపాక శాసన సభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు,భద్రాచలం శాసన సభ సభ్యులు తెల్లం వెంకట్రావు దర్శించుకున్నారు. వారిని ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో సాధారంగా ఆహ్వానించారు అనంతరం స్వామివారికి తెచ్చిన పట్టు వస్త్రాలును స్వీకరించి అర్చకులు స్వామివారికి తైలాభిషేకం ప్రత్యేక పూజలు గోత్రనామార్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు ఆలయం యొక్క విశిష్టతను చింతామణి జలపాతం (అక్కథార – చెల్లెధార) ను సర్వరోగనివారిణిగా పరిగణిస్తారని ఆలయ అర్చకులు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పోలీస్ శాఖ అధికారులు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.






