Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

వరంగల్ జులై 17 (అక్షర సవాల్) యువతకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ గల ఆరు కిలోల గంజాయి, ద్విచక్ర వాహనంని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ కాజీపేట విష్ణుపురి కి చెందిన ఫ్రాన్సియా ఆడం కారు డ్రైవర్ గా పని చేస్తూనే గంజాయి కి అలవాటు పడటంతో నిందితుడు గంజాయికి వున్న విలువను గుర్తించి తాను కూడా గంజాయి అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు గతంలో భద్రాచలంలో పరిచయంఅయిన హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిషా నుండి గంజాయి ని తెప్పించుకొని నిందితుడు ట్రై సిటీ పరిధిలో గంజాయి అవసమైన వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించే వాడు. ఇదే రీతిలో ఈ రోజు ఉదయం హంటర్ రోడ్డులోని కోడెం ఫంక్షన్ హల్ వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించాగా నిందితుడి వద్ద గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రయదారుణ్ణి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్. ఐ గాలిబ్ తో ఇతర పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రాజయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ, ఆలీ, ప్రభాకర్ లను హనుమకొండ ఏసీపీ అభినందించారు

Related Articles

Latest Articles