Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ :జులై 24( అక్షరసవాల్ ): 
తెలంగాణ శాసన సభలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పై ఈరోజు వాడి వేడి చర్చ జరిగింది ప్రశ్నోత్తరాల సమ యంలో ప్రతిపక్షం తరపున బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.

అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపో యిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందన్నారు. వారిని ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వ దగ్గర సమాధానం లేదని విమర్శించారు.

రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పోకడలను గమనిస్తుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. అన్నారు..

Related Articles

Latest Articles