Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడ్డ అభివృద్ధి… ఎమ్మెల్యే నాయిని

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకపడ్డ అభివృద్ధి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. 31 డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దుతా! ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. నగర మేయర్ కమిషనర్ కార్పొరేటర్లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన హనుమకొండ,అక్షర సవాల్: గత పాలకుల నిర్లక్ష్యంతో 31 డివిజన్ అభివృద్ధి పనులు వెనుక పడ్డాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 31 డివిజన్లోని హంటర్ రోడ్, వాసవి కాలనీ, గాయత్రి కాలనీలలో సుమారు 90 కోట్ల జనరల్ ఫండ్ తో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ బాజ్పాయ్, చాహత్, కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. 31 డివిజన్లో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి పనులు జరగలేదని, తాము వచ్చిన ఏడాదిన్నరలోనే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తీరుస్తామని 31 డివిజన్లోని న్యూ శాంపేట తో పాటు దీన్ దయాళ నగర్, సుజిత్ నగర్ లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయని అన్నారు. *ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ* శుక్రవారం 31 డివిజన్లో అభివృద్ధి పనులు శంకుస్థాపనతోపాటు ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇండ్లలో ఎమ్మెల్యే నాయిని భూమి పూజ చేశారు. గత పదండ్లలో ఇండ్లు నిర్మిస్తామని మాయమాటలు చెప్పిన కెసిఆర్ పతనమైపోయాడని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ను మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ముగ్గు పోసుకుని ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, ఈ ఈ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సురేందర్, నాయకులు సత్తు రమేష్ కృష్ణ ,పిండి రమేష్ యాదవ్ మామిండ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles