Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

రుద్రమ రాకెట్ లాంచ్‌కు కాళోజి కళాక్షేత్రం వేదిక 

 

Oplus_131072

రుద్రమ రాకెట్ లాంచ్‌కు కాళోజి కళాక్షేత్రం వేదిక 

 

శాస్త్ర ప్రాధాన్యతను వివరించిన ప్రముఖులు

భద్రకాళి బండ వద్ద విజయవంతమైన ప్రయోగం

హన్మకొండ, అక్షర సవాల్: కాళోజి కళాక్షేత్రం వేదికగా సాయంత్రం నిర్వహించిన “రుద్రమ రాకెట్” లాంచ్ సమావేశం శాస్త్రోత్సాహాన్ని రగిలించింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజేపాయ్, ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రొఫెసర్ ఆంజనేయులు, రాకెట్ సృష్టికర్త భూపతి శశాంక్ పాల్గొని శాస్త్ర విజ్ఞాన విశిష్టతను వివరిస్తూ యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సాయంత్రం ఐదు గంటలకు భద్రకాళి బండు వద్ద రుద్రమ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన పో లెపాక సునయన కాన్వాస్‌పై వేసిన రాకెట్ లాంచ్ చిత్రాన్ని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇస్రో శాస్త్రవేత్తలు మరియు ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌లకు అందజేశారు. విద్యార్థి ప్రతిభకు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం యువతలో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.

Related Articles

Latest Articles