Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

నెక్కొండ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నెక్కొండ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నెక్కొండ,ఫిబ్రవరి 28 అక్షర సవాల్: నెక్కొండ మండలంలోని నెక్కొండ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణా భావం పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.జాన్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి రవికుమార్ మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ,బాధ్యతాయుత భావం,స్వయం సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు.అలాగే ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నెక్కొండ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ శ్రీదేవి మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యతలను అనుభవాత్మకంగా తెలుసుకునే అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా లభిస్తుందని అన్నారు.ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సవాళ్లు,బాధ్యతలను విద్యార్థులు ప్రత్యక్షంగా గ్రహిస్తారని తెలిపారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిలో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ వినోద్,డీఈఓగా హర్షకుమార్,ఎంఈఓగా స్వాతి,కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు సారిక,వెన్నెల,ఉపాధ్యాయులు సనా,శ్రీనిక,మౌనిక,శ్రావణి,లోహిత్,హనీ,తన్మయి,అద్విక్ అంశు,పీఈటీలు సాత్విక్,అరుణ్ కుమార్,అర్జున్ పాల్గొన్నారు.అలాగే ఉపాధ్యాయులు బిక్షపతి,భారతి,మాలతి,కుమార్ రెడ్డి బద్రు,రాజేందర్‌తో పాటు విద్యార్థులు,తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Latest Articles