Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

శాస్త్ర విజ్ఞానంతో మారుతున్న జీవన విధానం

శాస్త్ర విజ్ఞానంతో మారుతున్న జీవన విధానం

మోంటిస్సోరి హైస్కూల్‌లో వైభవంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

నెక్కొండ, అక్షర సవాల్: నెక్కొండ మండల కేంద్రంలోని మోంటిస్సోరి హైస్కూల్‌లో జాతీయ సైన్స్ డే వేడుకలను శనివారం ఉత్సాహభరితంగా నిర్వహించారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం మానవ జీవితాన్ని అన్ని రంగాల్లో ప్రభావితం చేస్తూ జీవన విధానాన్నే పూర్తిగా మార్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలు,వివిధ పోటీ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు,ప్రయోగాలు సందర్శకులను ఆకర్షించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరస్పాండెంట్ తాటిపర్తి అంజన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ శాస్త్ర విజ్ఞానం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి సి.వి. రామన్ చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు  విద్యుత్‌ సమాచార సాంకేతికత వైద్య రంగం అంతరిక్ష పరిశోధనల వంటి కీలక రంగాల అభివృద్ధి శాస్త్ర విజ్ఞానం వల్లే సాధ్యమైందన్నారు. శాస్త్రం ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందించి తార్కిక ఆలోచనలకు మార్గం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకుంటే భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తోడ్పడే శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని కేవలం పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా సమాజ ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాస్త్రం ఉన్నచోటే ప్రగతి,అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రెజరీ డాక్టర్  ఆర్.ఆనందరావు సీనియర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Latest Articles