శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్ వన్ : ఐటి, పురపాలక మంత్రి కేటిఆర్
భూపాలపల్లి, అక్టోబర్ 9 (అక్షర సవాల్):
సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకుంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 37ఎకరాల స్థలంలో రూ. 25.90 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించగా, జిల్లా పోలీస్ కార్యాలయం కు చేరుకున్న మంత్రి కేటీఆర్ , డిజిపి అంజని కుమార్ ఐపీఎస్ తో కలిసి ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభించి, జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ కి పుష్పగుచ్చం అందజేసి సీట్లో కూర్చోబెట్టి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు ముందున్నారని కితాబు ఇచ్చారు. శాంతిభద్రతలను కాపాడడంలో కృత నిశ్చయంతో పోలీసులు పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పోలీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సహాయసహకారాలు అందించిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలోరాజీ లేకుండా శ్రమిస్తున్నారని, ముఖ్యంగా మహిళల భద్రత కొరకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. అధునాతన జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక సాంకేతిక సాంకేతికతను వినియోగించుకొని కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిజిపి అన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి , తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బండ ప్రకాష్ , వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ , భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి , కలెక్టర్ భవేష్ మిశ్రా ఐఏఎస్ , ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ , వరంగల్ సిపి ఏ.వి రంగనాథ్ ఐపీఎస్ , ములుగు ఎస్పి గౌస్ ఆలం ఐపీఎస్ , ఓఎస్డి అశోక్ కుమార్ ఐపీఎస్ , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ,మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి , జెడ్పి వైస్ చైర్పర్సన్ శోభారాణి . అదనపు ఎస్పీ ఏ.ఆర్ వి. శ్రీనివాస్ , భూపాలపల్లి, కాటారం, డీఎస్పీలు ఏ. రాములు, రామ్మోహన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.