ఎన్నికల్లో అక్రమ డబ్బు కట్టడిపై చర్యలు : జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్
-జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం.
భూపాలపల్లి, అక్టోబర్ 31(అక్షర సవాల్):
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీసుకు బ్యాంకర్లు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. మంగళవారం జిల్లాలోని బ్యాంకర్లతో జిల్లా పోలీసు కార్యాలయలో ఎస్పి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి బ్యాంకర్లు బాధ్యతగా సహకరించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగే నగదు ఉపసంహరణపై నిఘా ఉంటుదని అన్నారు. అనుమానస్పద బ్యాంకు అకౌంట్ల గురుంచి బ్యాంకర్లు తగిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు బ్యాంకర్లు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల భూపాలపల్లి, సిఐలు వేణు చందర్, రామ్ నర్సింహ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాశ్, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు