-
మావోయిస్టు అమర్చిన బాంబు పేలి ఒకరు మృతి
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో సంఘటన
ములుగు ,జూన్ 3 (Aksharasaval):
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. జగన్నాపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 1, ఇల్లందుల ఏసు (55 )2, ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్ 4,ఇల్లెందుల పాల్గుణ 5,అరికిల్ల లక్ష్మయ్య ఈ అయిదుగురు వ్యక్తులు వంటస్ చెరుకు తెచ్చుకోవడం కోసం కొంగాల అటవీ ప్రాంతానికి ఉదయం 6 గంటల సమయంలో వెళ్లారు గుట్ట వ్యక్తి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన బాంబు పేలి ఇల్లెందుల ఏసు అక్కడికక్కడే మృతి చెందాడు మిగతా నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై ప్రెషర్ బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది తెలుసుకున్న బంధువులు సంఘటన ప్రాంతానికి వెళ్లి కన్నీరు మున్నేరుగా విలిపిస్తున్నారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు ఇంకా చేరుకోలేదు.