అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
హైదరాబాద్, జులై 16( అక్షరసవాల్ )
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు రూ.2 లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్లో జరిగిన ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు.