విద్యుత్ షాక్ తో రైతు మృతి
వరంగల్ , జూలై 27 ( అక్షర సవాల్ ) వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాజిరెడ్డి (50) అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి. తన వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మోటర్ నడవకపోవడంతో విద్యుత్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.