సమాచారం మాకిస్తే బహుమతి మీకిస్తాం
మంగపేట, ఆగస్టు 21 ( అక్షర సవాల్ ) : యువత డ్రగ్స్ భారీనపడి ఉజ్వల భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ములుగు జిల్లా ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ అన్నారు. మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి ఆధ్వర్యంలో బుధవారం మంగపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో సే నో టు డ్రగ్స్ పోస్టర్ ను సీఐ అనుముల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాలను సేవించడం వలన అనేక అనర్ధాలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని అన్నారు . డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ తోడ్పడాలని , డ్రగ్స్ పై ఖచ్చితమైన సమాచారం ఇస్తే తగిన నగదు పారితోషికం ఇస్తామని, సమాచారం ఇచ్చిన వార్ వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.