Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పి

జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పి

భూపాలపల్లి, ఆగస్టు 24(అక్షర సవాల్):

జిల్లాలో జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మెడికల్ కాలేజీ తో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పి , అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాల అదుపుతో పాటు, నేరస్తులను గుర్తించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కమండ్ అండ్ కంట్రోల్ ద్వారా 24 గంటలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇల్లు ,ఆఫీసు, ముఖ్య కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఇలా చేయడం ద్వారా భద్రతా, నిఘా పెంచుకోవచ్చని ఎస్పి  అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం అవరమని ఎస్పి  పేర్కొన్నారు.

Related Articles

Latest Articles