హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్
Jun 29, 2025,
- హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా మరికొందరు బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఓ మీడియా ఛానల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు. అలానే అబద్ధాలకు అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.