Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

అభ్యాస్ స్కూల్లో విద్యార్థి అనుమానస్పద మృతి

  1. అబ్యాస్ స్కూల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి .. ఆందోళనకు దిగిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు. తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యం పొట్టన పెట్టుకుంది.. విద్యార్థి తల్లిదండ్రులు.. స్కూల్ కు పహారా కాస్తున్న పోలీసులు వరంగల్, అక్షర సవాల్: తొర్రూరు పట్టణంలో గల అభ్యాస్ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి బానోతు వెంకట్ చైతన్య (15) అనుమానాస్పద మృతి. అభ్యాస్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటూ.. చదువుతున్న వెంకట్ నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల శివారు మర్రికుంట తండాకు చెందిన బానోతు వెంకన్న కుమారుడు వెంకటచైతన్య. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఎలుకల మందు విద్యార్థి తాగి మరణించాడని స్కూల్ యాజమాన్యం తెలుపగా.. తమ పిల్లవాడు ఎంతో చురుకుగా ఉండేవాడని చదువు లో సైతం ముందంజలో ఉండేవాడు అన్నారు. అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అంటే నమ్మశక్యంగా లేదని పాఠశాల యాజమాన్యం , సిబ్బంది వల్లనే విద్యార్థి మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుండి స్కూల్ ఎదుట విద్యార్థి బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతి పట్ల పూర్తి వివరాలు పోస్టుమార్టం చేస్తే గాని తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. స్కూల్ ఎదుట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Related Articles

Latest Articles