అఖిల భారత కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ సదస్సు కు నగర మేయర్…..
కర్నాల్ లో నేడు, రేపు వార్షిక సర్వసభ్య సమావేశం….
కార్పొరేషన్, సెప్టెంబర్ 01 అక్షర సవాల్:
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏ ఐ సి ఏం) 53వ వార్షిక సర్వసభ్య సమావేశం 2వ (మంగళవారం) & 3వ సెప్టెంబర్ 2025 (బుధవారం) తేదీలలో కర్నాల్ (హర్యానా)లో జరుగనున్న నేపధ్యం లో అట్టి సదస్సుకు నగరం నుండి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఆహ్వానం అందిన తరుణం లో నగర మేయర్ గుండు సుధారాణి అట్టి సదస్సులో పాల్గొనడానికి సోమవారం బయలుదేరి వెళ్ళారు.
ఈ సందర్భం గా ఎజెండా అంశాల్లో భాగం గా మంగళ వారం (నేడు) 52వ వార్షిక జనరల్ బాడీ సమావేశం అంశాల(బుర్హాన్‌పూర్ – మధ్యప్రదేశ్ లో జరిగిన) ఆమోదం,నిర్ధారణ తో పాటు వివిధ రాష్ట్రాలలో మున్సిపల్ పనుల స్థితి గతులు,మేయర్ల మండలి సభ్యత్వ రుసుముపై చర్చ ,2024 ,2025 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ,వ్యయ బడ్జెట్ ఆమోదం,మేయర్ల మండలి కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు
అఖిల భారత కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ సదస్సు కు నగర మేయర్…..

