Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

ఎంజీఎం హైస్కూల్లో అంబరాన్నంటిన దీపావళి సంబురాలు

ఎంజీఎం హైస్కూల్లో అంబరాన్నంటిన దీపావళి సంబురాలు

భూపాలపల్లి, నవంబర్ 11 (అక్షర సవాల్):

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ఎంజీఎం హైస్కూల్ యందు దీపావళి పర్వదినం ముందు జరిపించే నరక చతుర్దశిని విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాఠశాల ఆవరణలో లక్ష్మి పూజ నిర్వహించి దీపాలు వెలిగించి టపాసులు కాల్చారు. తదనంతరం స్వీట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సతీష్ మాట్లాడుతూ భారతదేశం అంతా ఏకమై జరుపుకునే చాలా కొద్ది పండుగల్లో దీపావళి ఒకటి అని చీకటిని తొలగించి వెలుగును నింపే పండుగ అని చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తూ ఈ పండుగను జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి గ్యాదంగి రమాదేవి , సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles