Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి :  జిల్లా ఎస్పి 

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి :  జిల్లా ఎస్పి 

భూపాలపల్లి, జనవరి 2 (అక్షర సవాల్):

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసు సిబ్బంది పాటు పడాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే  సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలిసు దర్బార్ నిర్వహించి, సిబ్బంది సమస్యలు తెలుసుకుని, ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.జిల్లాలో సంభవించిన వరదల్లో, ఎన్నికల్లో ఇతర బందోబస్తు విధుల్లో డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసుల పనితీరు అభిందనియమని ఎస్పి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో సమర్దవంతంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, ఏ.అర్ అదనపు ఎస్పీ వి శ్రీనివాస్, ఇనిస్పెక్టర్లు, సూర్య ప్రకాశ్, రాజేశ్వర్ రావు, రత్నం, శ్రీకాంత్, సీసీ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

Related Articles

Latest Articles