Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎస్పి

అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎస్పి

– జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

భూపాలపల్లి, ఏప్రిల్ 14(అక్షర సవాల్):
జిల్లా పోలిసు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డా. భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ,ఒక సంఘసంస్కర్త అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతని,అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా,స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్ నగేష్, ఆర్ఎస్సై శివ, మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles