గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
-2 కేజీల గంజాయి స్వాధీనం
భూపాలపల్లి, సెప్టెంబర్ 5(అక్షర సవాల్):
భూపాలపల్లి ఉప మండల పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు మాట్లాడుతూ గురువారం ఉదయం 06:30 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు సూచనతో చిట్యాల సిఐ మల్లేశ్ పర్యవేక్షణలో గణపురం ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి రవి నగర్ గ్రామం వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆటోలో కనబడగా, వారి ఆటోలో వెతకగా ఆటో డ్రైవర్ కూర్చుండే సీటు కిందఒక ప్లాస్టిక్ కవర్ కట్టి ఉండటం గమనించి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అందులో దాదాపు 2 కేజీల గంజాయి కనిపించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, వీరు సంపాదించే డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలోని కొండ పరిహార ప్రాంతంలోని రమేష్ అనే వ్యక్తి దగ్గర గంజాయి తక్కువ ధరకి కొనుక్కొని వచ్చి అట్టి గంజాయిని భూపాలపల్లి మరియు గణపురం మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి అలవాటు ఉన్నవారికి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని అలా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో ఒప్పుకున్నారు. తదుపరి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసిన రెండు కేజీల గంజాయిని ఆటో మరియు ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేయడమైనది. నిందితుల వివరాలు దాసరి రాములు S/o విశ్వనాథం, వయస్సు 55, కులము పద్మశాలి, వృత్తి ఆటో డ్రైవర్, R/o బస్వరాజుపల్లి గ్రామము మరియు మిట్టపెల్లి నిశాంత్ S/o బిక్షపతి వయసు 28 సం, కులము మాదిగ, వృత్తి ఆటో డ్రైవర్, R/o బస్వరాజుపల్లి గ్రామము.ఈ సందర్బంగా భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు ప్రజలు సహకరించాలని, పూర్తి స్థాయిలో నియంత్రించుటకు పోలీసు యంత్రాంగం కష్టపడుతుందనీ, గంజయిపై ప్రత్యేక నిఘా పెట్టి గంజా నిర్మూలనకు కృషి చేస్తుందనీ, గంజాయి కి సంబందించిన ఏ సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా గాని స్థానిక పోలీసు అధికారికి చేరవేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.ఇట్టి రెండు కేజీల గంజాయి పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన చిట్యాల సిఐ మల్లేష్ మరియు ఎస్సై ఘనపూర్ అశోక్ మరియు సిబ్బంది రాజు, సందీప్ ,నేతాజీ,శ్రీనివాసులు, యాకేష్ ను భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు ప్రత్యేకంగా అభినందించారు.