రామగుండం ఓసిపి 2 లో కప్పు కూలి ఇద్దరు దుర్మరణం
పెద్దపల్లి జులై 17(అక్షర సవాల్) : పెద్దపల్లి జిల్లా రామగుండం లోని సింగరేణి ఓసిపి 2 లో గని బుధవారం రాత్రి సైడ్ కప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృత్యువాత పడిన సంఘటన జరిగింది. వాటర్ పైప్ లైన్ మరమ్మత్తులు చేస్తుండగా సైడ్ పై కప్పు ఒక్కసారిగా కూలడంతో కార్మికులు అందులో ఇరుక్కుపోయి శ్వాస ఆడక ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ సాగర్ లు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

