నూతన పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎస్పీ
మంగపేట, డిసెంబర్ 24 ( అక్షర సవాల్ ) : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్ మంగళవారం పరిశీలించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్పీ శబరిష్ కు స్థానిక ఎస్సై టివిఆర్ సూరి స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణం పూర్తయి పెయింటింగ్ చివరి దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి నిర్మాణం పట్ల ఎస్పీ డాక్టర్ శబరిష్ సంతృప్తి వ్యక్తం చేశారు.