Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

సంఘ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి

సంఘ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి

 

మంగపేట, జనవరి 02 ( అక్షర సవాల్ )  : మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరూ సంఘ నిభందనలకు, సంఘ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మంగపేట  మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పూజారి శ్రీనివాస్ సంఘసభ్యులకు సూచించారు. గురువారం మంగపేట మండలం గంపోనిగూడెం మార్కెట్ గోడన్ వద్ద మంగపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అక్కపెల్లి రాజేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్ల డైరీ ఆవిష్కరణ, పరపతి చిట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి శ్రీనివాస్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ముడి సరుకుల ధరలు పెరిగినందున వాటికి అనుగుణంగా సంఘం నిర్ణయించిన ధరలకు సంఘం యొక్క సభ్యులు అందరూ సంఘానికి కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్స్  పల్లపు రమేష్, వంగరి విశ్వనాధ్ ( లియో ఫ్లెక్సి ) ఉగ్గుమల్ల గణేష్, శివనేని మహేష్, పిల్లలమర్రి కార్తీక్, తాటి కమలాకర్, , శ్రీకాంత్, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles