*హలో మాల ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ*
తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు
చిట్టిమల్ల సమ్మయ్య
మంగపేట, నవంబరు16, అక్షర సవాల్: నవంబర్ 26న ఢిల్లీలో జరగబోవు రాజ్యాంగ హక్కుల సాధన సభకు ములుగు జిల్లాలోని మాల సోదరీ సోదరీమణులు అంబేద్కర్ వారసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యడు చిట్టిమల్ల సమ్మయ్య జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం చిట్టిమల్ల సమ్మయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించిన దినం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశ పౌరులకు ఓటు హక్కుతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించిన మహోన్నత నాయకుడని కొనియాడారు నవంబర్ 26న ఢిల్లీ జంతర్ మంతర్ లో రాజ్యాంగ హక్కుల సాధన సభ ద్వారా పలు డిమాండ్ లతో నిర్వహించే సాధన సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాలలు మాల అనుబంద కులాల దళిత నాయకులు మేధావులు విద్యార్థి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలాలని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదరి రాంబాబు జిల్లా నాయకులు కాళ్ళ రామకృష్ణ తోగరు అశోక్ రఘు దండ్రే శంకర్ ఊళ్లేరావు శ్రవణ్ కుమార్ మంగపేట మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర కుమార్ వెంకటాపూర్ మండల నాయకులు కుక్కల నారాయణ నారామల్ల సారంగపాని తదితరులు పాల్గొన్నారు.

