Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

మడికొండలో నూతన పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన డిజిపి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిర్వహణలో మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

మడికొండలో నూతన పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన డిజిపి

హన్మకొండ మార్చి 1 అక్షర సవాల్:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిర్వహణలో మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.పోలీసు సిబ్బంది సంక్షేమం మరియు వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారిక వాహనాల ఇంధన అవసరాలను ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా సకాలంలో, నాణ్యమైన సేవలతో తీర్చనున్నట్లు వెల్లడించారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇంధన సరఫరాలో పారదర్శకత, సమయపాలన, మరియు సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీలు కవిత,అంకిత్ కుమార్, ఏ.ఎస్పీ శుభం,అదనపు ఏసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్,కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, యం. టి. ఏసీపీ అంతయ్య, సురేంద్ర, ఇండియన్ అయిల్ తేరితోరియల్ ఇంచార్జ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles