Trending Now
Tuesday, March 3, 2026

Buy now

Trending Now

సాంప్రదాయబద్ధంగా హోళీ జరుపుకోవాలి

వరంగల్ జిల్లా నెక్కొండ మండల ప్రజలు హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతాయుతంగా పరస్పర గౌరవాన్ని కాపాడుతూ జరుపుకోవాలని ఎస్సై ఎం. మహేందర్ సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

సాంప్రదాయబద్ధంగా హోళీ జరుపుకోవాలి

ఎస్సై ఎం.మహేందర్

నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండల ప్రజలు హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతాయుతంగా పరస్పర గౌరవాన్ని కాపాడుతూ జరుపుకోవాలని ఎస్సై ఎం. మహేందర్ సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సహజసిద్ధమైన పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని సూచించారు.ఇతరుల అభిమతానికి విరుద్ధంగా రంగులు చల్లడం,నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.హోళీ చందా పేరుతో బలవంతపు వసూళ్లు చేయడం చట్టవిరుద్ధమని అలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని,మండల వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అతివేగాన్ని నివారించాలని,మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే చెరువులు,కుంటలు,కాలువల సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. శాంతి,భద్రత వాతావరణంలో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకుని పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నెక్కొండ మండల ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles