బాధితులకు న్యాయం చేయాలి : జిల్లా ఎస్పి
భూపాలపల్లి, జనవరి 22(అక్షర సవాల్):
సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా సమర్దవంతంగా పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశించారు. సోమ వారం ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన 12 మంది బాధితుల నుంచి ఎస్పి పిర్యాదులు స్వీకరించారు.అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.బాధితుల సమస్యలపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోని, నివేదికను అందజేయాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పోలీసులకు శాంతిభద్రతలను కాపాడడంలో సహకరించాలని ఎస్పి కిరణ్ కోరారు.