ఆక్రమణలపై ఉక్కు పాదం
గుడిసెలపై బుల్డోజర్
వందల మంది పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపు..
హైకోర్టు ఆర్డర్ను అమలు చేస్తున్న
బల్దియా వరంగల్ ,జూలై 20 అక్షర సవాల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ 28వ డివిజన్ సంతోషిమాత గుడి ప్రాంతంలోని బఫర్ జొన్ లో అక్రమంగా కాంపౌండ్లు కట్టిన వాటిని 200 మంది పోలీసుల సహాయంతో టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ సిబ్బంది అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. విశ్రాంత ఆచార్య ఎం పాండురంగరావు హైకోర్టులో పిటిషన్ ఆధారంగా చీఫ్ జస్టిస్ అలోకారాదే ,జస్టిస్ జి అనిల్ కుమార్ చెరువులో ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలు నిర్మించిన నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ,ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వరంగల్ జిల్లా కలెక్టర్ బల్దేయ కమిషనర్ కూడా వైస్ చైర్మన్ లకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆర్డర్ల ఆధారంగానే బల్డియా కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలను శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. సంతోషిమాత గుడి పరిధి కాలనీవాసులు 12 మోరీల వద్ద ఆందోళన చేస్తున్నారు.