Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

రెసోనెట్ 2026 కు విశేష స్పందన

రెసోనెట్-2026కి విశేష స్పంద‌న‌

2700కుపైగా విద్యార్థినీ విద్యార్థులు

టైసిటీతోపాటు వివిధ జిల్లాల నుంచి హాజ‌రు

ప్రత్యేక శిక్షణ కోసం అడ్మిషన్ కోరుకునే విద్యార్థులకు ఫీజు రాయితీ..

రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ, నీట్‌, మెడిక‌ల్ క‌ళాశాల‌ల ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్ నీట్ కోచింగ్‌కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రెజోనెన్స్ విద్యాసంస్థలు హన్మకొండలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన స్కాలర్షిప్, ఫీ కన్సెషన్ ప్రోత్సాహక పోటీ పరీక్ష రెజోనెట్ -2026కి విశేష స్పంద‌న ల‌భించింది. హన్మకొండ, వరంగల్‌తోపాటు ఇతర జిల్లాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన 2700 కుపైగా విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. న‌గ‌రంలోని మూడు సెంట‌ర్ల‌లో నిర్వాహ‌కులు ఈ ప‌రీక్ష నిర్వ‌హించారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు అన్ని ప్రైవేట్, ప్ర‌భుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

  1. ఎంపీసీ + జేఈఈ మెయిన్ మ‌రియు అడ్వాన్స్‌డ్ బీఎల్‌పీసీ + నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రత్యేక శిక్షణ కోసం అడ్మిషన్ కోరుకునే విద్యార్థులకు 10 నుండి 100 శాతం ఫీజు రాయితీ లభిస్తుందని రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఈ పరీక్షకు ఇంతటి అనూహ్య స్పందన రావడానికి తమ రెజోనెన్స్ వరంగల్ విద్యాసంస్థల అద్భుత విజయాలేనని కార‌ణ‌మ‌న్నారు. ప్రతి సంవత్సరవం దేశంలోని వివిధ ఐఐటీలు, నిట్‌, మెడిక‌ల్ కాలేజీల్లో వందలాది మంది విద్యార్థుల సీట్లు సాధించడానికి తమ రెజోనెన్స్ వరంగల్ విద్యాసంస్థలు కారణ మవ్వడం గర్వంగా ఉందని రాజిరెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెసోనెట్ – 2026 టెస్ట్ ఇంతటి విజయవంతం అవ్వడానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు, శ్రేయోభిలాశులైన స్కూలు ఉపాధ్యాయులు, ప్రస్తుత, గత విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పేరుపేరున రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏవో లెక్కల రమ్య రాజిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

    రెజోనెన్స్ వద్ద బారులు తీరిన విద్యార్థులు
    అక్షర సవాల్

Related Articles

Latest Articles