Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సివిల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సివిల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్

భూపాలపల్లి, అక్టోబర్ 22 (అక్షరా సవాల్):

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చేశాయి. ఇవి తొలి విడత బలగాలు కాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయి. ఎస్పి  కిరణ్ ఖరే ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం పారామిలటరీ బలగాలు భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు అద్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించాయి.

ఈ సందర్భంగా డిఎస్పీ రాములు  మాట్లాడుతూ , అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజా స్వామ్యం లో ఓటే అయుధమని ప్రతి ఒక్కరూ ఓటువేయాలన్నారు.

Related Articles

Latest Articles