Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గణపురం, జూన్ 2(అక్షర సవాల్):

చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడిందని ప్రతి ఒక్కరు బాధ్యతతో, చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా మనమంతా కలిసికట్టుగా ఉంటూ దేశంలో తెలంగాణను రోల్ మోడల్ గా చేయడానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్,ప్రిన్సిపల్ మధుకర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles