క్షేమంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ జూలై 31, అక్షర సవాల్: ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి, వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయిన ఈ సదస్సులో ముందుగా ఆటో డ్రైవర్లు ఎవిధంగా రోడ్లపై ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఎలాంటి నిబంధనలను పాటించాల్సి వుంటుదనే దానిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు, ఆర్.టి.ఓ అధికారులకు సూచించారు. అలాగే ఈ సదస్సు ఆటో డ్రైవర్లు ఎదుర్కోంటున్న సమస్యలను కూడా పలువురు ఆటో డ్రైవర్లు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఖాకీ యూనిఫారం ధరించే పోలీస్, ఆటోడ్రైవర్లు ఇరువురు ప్రజలకు సేవలందించేవారమని, ప్రధానంగా నగరంలో ఎంతో మంది డ్రైవర్లు లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్నారు. వీరికి ప్రమాదవశాత్తు ఎదైన జరిగితే భీమా నుండి ఎలాంటి లబ్ది రాదని, కావున లైసెన్స్ లేని డ్రైవర్లక